పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

  • తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల 
  • అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులు
  • రీకౌంటింగ్ కోసం రూ.500, రీవెరిఫికేషన్ కోసం రూ.1,000 ఫీజు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ క్రమంలో ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలను వెల్లడించింది.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీన ప్రారంభమై జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు ఒక సబ్జెక్టుకు రూ.1000 ఫీజు ఉంటుంది.

TS SSC Exams
Telangana SSC Results 2024
SSC Supplementary Exams
Telangana 10th Class Results

More Telugu News